ISRO : ఇస్రో మరో సంచలనం

Update: 2024-06-24 08:00 GMT

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తన పునర్వినియోగ ప్రయోగ వాహనం- ఎల్ఎక్స్-03 (RLV-లెక్స్-03) 'పుష్పక్ 'ను వరుసగా మూడో సారి విజయవంతంగా పరీక్షించింది. పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని ల్యాండింగ్ చేయడంలో విజయం సాధించిన తర్వాత, 'పుష్పక్' కక్ష్య రీ-ఎంట్రీ పరీక్షను నిర్వహించడానికి మార్గం సుగమమైంది.

బెంగళూరుకు 220 కిలోమీటర్ల దూరంలోని చిత్రదుర్గ జిల్లాలోని చల్లకెరె వద్ద ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో ఈ పరీక్ష జరిగింది. అంతరిక్షం నుంచి వచ్చిన నౌక కోసం అప్రోచ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్, హై స్పీడ ల్యాండింగ్ పరిస్థితులను సిమ్యులేట్ చేయడం ద్వారా పుష్పక్ అభివృద్ధికి అవసరమైన అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించినట్లు తెలిపింది. ఇస్రో ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Tags:    

Similar News