Sameer Modi : అత్యాచారం కేసులో లలిత్ మోదీ సోదరుడు అరెస్ట్

Update: 2025-09-19 10:28 GMT

IPL మాజీ చీఫ్ లలిత్ మోదీ సోదరుడు, వ్యాపారవేత్త సమీర్‌ మోదీ ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఆయన్ను ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో సమీర్‌తో సహజీవనం చేసిన మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ క్రమంలో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా ఒకరోజు జుడీషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో సదరు మహిళ సమీర్‌ను రూ.50కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. మరోవైపు ఐపీఎల్‌కు బాస్‌గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడని లలిత్‌ మోదీ (Lalit Modi) ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతో 2010లో లండన్‌కు పారిపోయిన అతడు.. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్‌ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News