Maharashtra: భార్యకు చీర కట్టుకోవడం రాదు..! అందుకే భర్త ఆత్మహత్య..
Maharashtra: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉండే సమాధాన్ సాబ్లే అనే 24 ఏళ్ల వ్యక్తికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది.;
Maharashtra: ఆత్మహత్యలు, హత్యలు.. ఇవన్నీ మనిషి ప్రాణాలు తీస్తాయని తెలిసినా.. దీని వల్ల కుటుంబాలపై ప్రభావం పడుతుందని తెలిసినా.. ఈమధ్య వీటిని చాలామంది సీరియస్‌గా తీసుకోవడం లేదు. అందుకే చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు, హత్యలు లాంటి వాటికి పాల్పడుతున్నారు. తాజాగా ముంబైలో ఓ భర్త.. తన భార్యకు చీర కట్టుకోవడం రాదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని అతడు సూసైడ్ లెటర్‌లో తెలిపాడు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ముకుంద్ నగర్‌లో ఉండే సమాధాన్ సాబ్లే అనే 24 ఏళ్ల వ్యక్తికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లయినప్పటి నుండి తన భార్యతో సమాధాన్ సంతోషంగా లేడని సమాచారం. అందుకే ఇక భరించలేని సమాధాన్ ఇటీవల ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణం తర్వాత పోలీసులు తన గది నుండి ఓ సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సమాధాన్ తన సూసైడ్ నోట్‌లో తన భార్యకు చీర కట్టుకోవడం రాదని.. సరిగ్గా మాట్లాడడం, నడవడం కూడా రాదని పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా తన భార్య సమాధాన్ కంటే ఆరేళ్లు పెద్ద అని కూడా వారు తెలిపారు.