Mamata Banerjee : కేంద్రంపై మమత ఫైర్.. ఉన్నావ్ ఘటన గుర్తులేదా అంటూ ఎదురుదాడి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కోల్‌కతా హత్యాచార ఘటనపై తమను టార్గెట్ చేయడంపై మండిపడ్డారు. ఉన్నావ్ ఘటన గుర్తు లేదా అని ప్రశ్నించారు. ఆ ఘటనలో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారని గుర్తు చేశారు. హత్రాస్‌లో దళిత మహిళపై దారుణం జరిగినప్పుడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో సగటున రోజుకు 90 అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని కేంద్రం ఏం చేస్తోందంటూ మమతా బెనర్జీ ప్రశ్నించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్ట సవరణ బిల్లును బెంగాల్ అసెంబ్లీలో ఆమోదించారు.