తనను హతమారుస్తామని ఎస్‌ఎంఎస్‌లు ఫోన్‌కాల్స్‌లో బెదిరింపులు వస్తున్నాయని ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వేషం పెంచుకుందని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీలో తనపై కాల్పులు జరిపిన దుండగులను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను అణచివేసే యత్నం చేస్తున్నారన్నారు. ముస్లింలతోపాటు దళితులు, బడుగు బలహీనవర్గాల గొంతుకనై వారి సమస్యలపై నినదిస్తున్న తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. దిల్లీలోని తన అధికారిక నివాసంపై పలుమార్లు దాడులు చేశారన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తున్న తనపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపిన దుండగుల్లో ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదని.. ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు.