PAK: అబద్దాల పాకిస్థాన్

సైనిక స్థావరాలు, అలయాలే లక్ష్యంగా డ్రోన్ దాడులు.. 400 డ్రోన్లు కూల్చేసిన భారత రక్షణ శాఖ;

Update: 2025-05-10 04:15 GMT

భారత్‌లోని ప్రార్థన స్థలాలనూ పాకిస్థాన్‌ లక్ష్యంగా చేసుకుంటోందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు. ఇండియా-పాకిస్థాన్ యుద్ధ పరిస్థితులపై తాజాగా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ మన దేశ సైనిక స్థావరాలు, నాలుగు ఎయిర్ పోర్టులే లక్ష్యంగా దాడులు చేసింది. మన దేశంలోని గురుద్వారాలపై దాడులు చేసి దేశంలో మత ఘర్షణలు సృష్టించాలని కుట్ర చేసింది. పాక్ ప్రయత్నాలను ఇండియన్ ఆర్మీ బలంగా తిప్పి కొట్టింది. పాక్ వాడిన 400 డ్రోన్లను ఇండియా కూల్చేసింది. పాకిస్థాన్ ప్రపంచాన్ని మోసం చేయాలని చూస్తోంది. మన ప్రార్థనా మందిరాలపై దాడి చేయట్లేదని చెబుతూనే.. ఇక్కడ దాడులు చేయాలని చూస్తోందన్నారు. న్లను ప్రయోగించిందని భారత సైన్యం తెలిపింది. ఈ దాడుల వెనుక భారత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచారాన్ని సేకరించడమే పాక్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంది.**

సైనిక స్థావరాలే లక్ష్యంగా...

పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగి, నియంత్రణ రేఖ వెంబడి ఉల్లంఘనలకు పాల్పడుతూ భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ప్రారంభించిందని వివరించారు. పాక్ వైపు నుంచి వచ్చిన అనేక డ్రోన్లను భారత బలగాలు కూల్చివేశాయని, ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారని పేర్కొన్నారు. పంజాబ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తత కొనసాగుతోందని, పాక్ దాడులను భారత వాయుసేన సమర్థంగా అడ్డుకుందని తెలిపారు. దాడుల కోసం టర్కీకి చెందిన 'ఆసిస్‌గార్డ్ సోంగర్' రకం డ్రోన్లను పాకిస్థాన్ ఉపయోగించినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసిందన్నారు. పాక్‌ తన దుశ్చర్యలను అంగీకరించే బదులు.. భారత్‌పై దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాల్లో ఆ దేశం ఆరితేరిందని మండిపడ్డారు. పాకిస్థాన్‌లోని నన్కానా సాహిబ్ గురుద్వారాను భారత్‌ లక్ష్యంగా చేసుకున్నట్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిందని, ఇది మరో పచ్చి అబద్ధమని ఖండించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో ఈ ఘటనలకు మతపరమైన రంగును పులిమేందుకు దాయాది దేశం యత్నిస్తోందని విమర్శించారు.

పౌర విమానాలను రక్షణ కవచాలుగా...

**పాకిస్థాన్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా వాడుకుని భారత్‌పై దాడికి పాల్పడిందని భారత రక్షణ శాఖ ప్రతినిధులు వెల్లడించారు. పాకిస్థాన్ డ్రోన్, క్షిపణి దాడులు ప్రారంభించినా కరాచీ, లాహోర్ మధ్య పౌర విమాన సర్వీసులను నిలిపివేయలేదని తెలిపారు. తమ దాడులకు భారత్ నుంచి ప్రతిస్పందన వస్తుందని తెలిసి కూడా, పౌర విమానాలను అడ్డుపెట్టుకోవడం ద్వారా పాకిస్థాన్ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిందని అన్నారు. భారత్-పాక్ సరిహద్దు సమీపంలో ప్రయాణించే విమానాలతో పాటు, పాకిస్థాన్‌లోని పౌర విమానాలకు సురక్షితం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Tags:    

Similar News