చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆరోగ్య పరిస్థితిపై త్వరలో అప్డేట్ ఇస్తామని ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి. కాగా ఛాతీలో నొప్పితో శక్తికాంత దాస్ ఇవాళ ఉదయం ఆసుపత్రిలో చేరారు. ఎసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, పరిశీలన కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారని వివరించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఉర్జిత్ పటేల్ హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఆరేళ్ల క్రితం ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టారు. తన పదవీ కాలంలో, కోవిడ్ కారణంగా దేశంలో తలెత్తిన ద్రవ్యోల్బణం సమస్యను నియంత్రించడంలో ఆయన విశేషమైన కృషి చేశారు.