Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, ట్రాక్టర్ ఢీ.. ఐదుగురు మృతి..
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.;
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-ట్రాక్టర్ ఢీ కొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గరియాబంద్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బగేల్. మృతుల కుటుంబాలకు రెండు లక్షల నష్ట పరిహారం, గాయపడిన వారికి 50 వేల పరిహారం అందిస్తామని తెలిపారు.