SBI : ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 11న ఆగిపోనున్న UPI, YONO యాప్ సేవలు.

Update: 2025-10-11 05:00 GMT

SBI : మీరు ఎస్బీఐ కస్టమర్ అయితే ముఖ్యంగా ఆన్‌లైన్ సేవలు, UPI ఉపయోగిస్తుంటే మీకు అలర్ట్. ఎందుకంటే, మెరుగైన సేవలను అందించేందుకు బ్యాంక్ తన సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ కారణంగా అక్టోబర్ 11వ తేదీ అర్థరాత్రి కొన్ని గంటల పాటు ఎస్‌బీఐ ముఖ్యమైన డిజిటల్ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి, సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు రెగ్యులర్ మెయింటెనెన్స్ పనులు చేస్తుంది. ఈ కారణంగా అక్టోబర్ 11వ తేదీ అర్థరాత్రి (అంటే 12వ తేదీ తెల్లవారుజామున) కొన్ని ముఖ్యమైన డిజిటల్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయని బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. ఈ మెయింటెనెన్స్ సమయంలో ఎస్బీఐ యూపీఐ, YONO యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS, IMPS సేవలు నిలిచిపోనున్నాయి.

ఈ సర్వీసులు అక్టోబర్ 11వ తేదీ రాత్రి 1:10 గంటల నుండి 2:10 గంటల వరకు పనిచేయవు. అంటే, సరిగ్గా 60 నిమిషాల పాటు ఈ సేవలు నిలిచిపోతాయి. ఈ సమయంలో కస్టమర్లు YONO యాప్ ద్వారా గానీ, UPI ద్వారా గానీ ఎలాంటి లావాదేవీలు చేయలేరు. ఈ అంతరాయం ఎటువంటి సాంకేతిక లోపం వల్ల కాదని, భవిష్యత్తులో కస్టమర్లకు మరింత వేగవంతమైన, మెరుగైన డిజిటల్ సేవలు అందించడానికి బ్యాంక్ చేస్తున్న రెగ్యులర్ సిస్టమ్ మెయింటెనెన్స్ పనులలో భాగంగా జరుగుతుందని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఈ అంతరాయం వల్ల కస్టమర్‌లకు కలిగే అసౌకర్యానికి బ్యాంక్ చింతిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

కస్టమర్లు ఈ అంతరాయం నుంచి తప్పించుకోవడానికి కొన్ని ప్రత్యామ్నాయాలను పాటించాలని బ్యాంక్ సూచించింది. ఏదైనా ముఖ్యమైన లావాదేవీ, బిల్లు చెల్లింపు లేదా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఉంటే, అక్టోబర్ 11 రాత్రి 1:00 గంటల కంటే ముందే పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఈ సమయంలో డబ్బు అవసరం ఉంటే, సమీపంలోని ATM లను ఉపయోగించుకోవచ్చు. చిన్న మొత్తంలో లావాదేవీలు చేసే వారికి UPI Lite సేవలు ఈ సమయంలో కూడా అందుబాటులో ఉంటాయని బ్యాంక్ తెలిపింది. అత్యవసర పరిస్థితుల కోసం కొంత నగదును సిద్ధంగా ఉంచుకోవడం తెలివైన పని. కొద్ది రోజుల క్రితం, అక్టోబర్ 8న కూడా కొందరు కస్టమర్లు UPI సేవల్లో అంతరాయం ఏర్పడిందని ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో కూడా బ్యాంక్ UPI Lite సేవను ఉపయోగించమని సూచించింది.

Tags:    

Similar News