Prabhas: కొత్త లుక్‌లో ప్రభాస్.. 'ఏం ఉన్నాడ్రా బాబు'..

తాజాగా ఓ మూవీని ప్రమోట్ చేయడానికి వచ్చిన ప్రభాస్.. బ్లాక్ షర్ట్‌లో, రఫ్ లుక్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు.

Update: 2022-01-12 05:45 GMT

Prabhas (tv5news.in)

Prabhas: పాన్ ఇండియా స్టార్‌‌గా మారిన ప్రభాస్.. ప్రస్తుతం క్షణం కూడా తీరిక లేకుండా వరుస సినిమాలతో, షూటింగ్లతో బిజీగా గడిపేస్తున్నాడు. ఏదైనా మూవీ ప్రమోషన్ అయితే తప్పా పెద్దగా బయటికి కూడా రావట్లేదు. తాజాగా ఓ మూవీని ప్రమోట్ చేయడానికి వచ్చిన ప్రభాస్.. బ్లాక్ షర్ట్‌లో, రఫ్ లుక్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు. ప్రభాస్‌ను చూసి తన లేడీ ఫ్యాన్స్ అంతా ఏమున్నాడ్రా బాబు అనుకోకుండా ఉండలేరు.



ప్రస్తుతం ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' విడుదలకు సిద్ధంగా ఉంది.


బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో కలిసి చేస్తున్న 'ఆదిపురుష్' చిత్రం షూటింగ్ కూడా పూర్తయ్యింది.


కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ప్రభాస్ చేస్తున్న 'సలార్' సినిమా గురించి ప్రస్తుతానికి ఏ అప్డేట్ లేదు.


యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న 'ప్రాజెక్ట్ కె' సినిమా ఇటీవల షూటింగ్‌ను ప్రారంభించుకుంది.


ప్రస్తుతం ప్రభాస్ క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తూ.. త్వరలోనే తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.







Tags:    

Similar News