Riddhi Kumar: ఆ ముగ్గురు హీరోలు తన క్రష్ అంటున్న 'రాధే శ్యామ్' బ్యూటీ..
Riddhi Kumar:నటించింది రెండు సినిమాలే అయినా అప్పుడే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది రిద్ధి కుమార్;
Riddhi Kumar (tv5news.in)
Riddhi Kumar: తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా.. మూడో సినిమాకే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది రిద్ధి కుమార్.
రాజ్ తరుణ్‌తో నటించిన 'లవర్' చిత్రంతో రిద్ధి కుమార్ హీరోయిన్‌గా పరిచయమయ్యింది.
రిద్ధి కుమార్ కీలక పాత్రలో నటించిన 'రాధే శ్యామ్' మార్చి 11న విడుదల కానుండగా తాను కూడా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది.
'రాధే శ్యామ్' చిత్రంలో రిద్ధి కుమార్ క్యారెక్టర్ పేరు తార.
తార క్యారెక్టర్ చాలా బాగుంటుందని జాగ్రత్తగా నటించమని ప్రభాస్ తనకు సజెస్ట్ చేశారని రిద్ధి తెలిపింది.
అసలు స్పోర్ట్స్ అంటే ఇష్టం లేని తనకు ఓ స్పోర్ట్స్ పర్సన్ పాత్ర ఇచ్చారని రిద్ధి చెప్పింది.
టాలీవుడ్‌లో ఎన్‌టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ అంటే తనకు క్రష్ ఉందని.. వారితో నటించాలనుందన్న విషయాన్ని బయటపెట్టింది రిద్ధి కుమార్.