భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సుయాత్రకు విశేష స్పందన
టీడీపీ చేపట్టిన భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సుయాత్రకు అనకాపల్లి జిల్లాలో విశేష స్పందన వస్తోంది.;
టీడీపీ చేపట్టిన భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సుయాత్రకు అనకాపల్లి జిల్లాలో విశేష స్పందన వస్తోంది. తొలుత మాడుగుల సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన టీడీపీ నేతలు.. ఆ తర్వాత భవిష్యత్‌కు గ్యారెంటీ చైతన్య రథాన్ని ప్రారంభించారు. నాడు జగన్ ఒక్క ఛాన్స్ అని వస్తే ఇపుడు ప్రజలు వైసీపీకి ఇదే చివరి ఛాన్స్ అని అంటున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. జగన్ సర్కారు పూర్తిగా కమీషన్ ప్రభుత్వంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. నాగాలాండ్ కంటే ఏపీ ఆర్థిక పరిస్థితి కిందకు దిగజారిందని విమర్శించారు.