ఐపీఎల్ ఫైనల్‌లో ఓటమి తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఎమోషనల్ అవడం చూసి తనకు బాధేసిందని అమితాబ్ బచ్చన్ తెలిపారు. కెమెరాలకు అటువైపుగా ముఖం తిప్పుకుని ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం తాను చూశానని ఆయన తన బ్లాగ్ పోస్టులో రాసుకొచ్చారు. ఫైనల్ మ్యాచ్‌లో అదే టచింగ్ మూమెంట్ అని పేర్కొన్నారు. ఓటమిని పట్టించుకోకుండా రేపు మరో అవకాశం వస్తుందని గుర్తుంచుకోవాలని కావ్యకు సూచించారు.
బచ్చన్ తన బ్లాగ్ ద్వారా షారూఖ్ ఖాన్ టీమ్ గెలిచినందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు. అలానే సన్ రైజర్స్ ఓడిపోయినందుకు డిసప్పాయింట్ అయ్యానని పేర్కొన్నాడు. ఈ సంవత్సరం అత్యుత్తమ జట్లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచిందని ప్రశంసించాడు. ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్‌రైజర్స్ ఓడిపోయిన తర్వాత ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ కన్నీళ్లు ఆపుకోవడం చూసి, చాలా బాధపడ్డానని అమితాబ్ పేర్కొన్నాడు.
ఆదివారం (మే 26 న) జరిగిన ఫైనల్ మ్యాచ్ లో SRH, KKR జట్లు తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ విజేతగా నిలిచింది. టోర్నీ ఆద్యంతం భారీ స్కోర్లతో రెచ్చిపోయిన హైదరాబాద్ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత కేకేఆర్ కేవలం 10 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని సాధించింది. తద్వారా ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది.