Anand Mahindra : రైజింగ్ స్టార్ సర్ఫరాజ్‌ తండ్రికి ఆనంద్ మహీంద్ర బంపర్ ఆఫర్

Update: 2024-02-16 11:11 GMT

రంజీ క్రికెట్ స్టార్, ముంబై క్రికెటర్ సర్ఫరాజ్‌ఖాన్‌ ఇంగ్లండ్‌ తో భారత్ ఆడుతున్న మూడో టెస్టులో సూపర్ పెర్ఫామన్స్ ఇచ్చాడు. ఎన్నాళ్లుగానో భారత జట్టు తరఫున ఆడాలని ఆయన ఆకాంక్ష వెల్లడించాడు. ఇంగ్లండ్ టెస్ట్ లో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అతడి కోరిక నెరవేర్చింది. వచ్చిన అవకాశాన్ని అతను బాగా వినియోగించుకున్నాడు.

రంజీల్లో టన్నుల కొద్ది పరుగులు చేసిన ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్‌.. తొలి టెస్టులోనే సూపర్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. జడేజా సమన్వయ లోపంతో రనౌట్ చేయించకపోయి ఉంటే అద్భుత ఇన్నింగ్స్ ఆడేవాడే అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

సర్ఫరాజ్‌ ఖాన్ చేసింది హాఫ్ సెంచరీ అయినా.. అతడి డెడికేషన్, ఆట తీరు ఒక్కరోజులోనే బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర కూడా ఫిదా అయ్యాడు. సర్ఫరాజ్ ఆటతీరును ప్రశంసిస్తూ ఎక్స్‌ లో స్పందించారు. సర్ఫరాజ్‌ఖాన్‌ ను క్రికెటర్‌ గా తండ్రి నౌషాద్‌ ఖాన్‌ తయారుచేశారని.. అందుకే ఆయనకు ధార్ వాహనాన్ని గిఫ్డ్ గా ఇస్తున్నానని ప్రకటించారు. ఎంతో శ్రమ, తెగువ, ఓర్పును తండ్రి కొడుకు ప్రదర్శిస్తేనే ఇది సాధ్యమవుతుందని.. అందుకే ఈ కానుక అందిస్తున్నానని ఆనంద్ మహీంద్రా తెలిపారు.

Tags:    

Similar News