ASIA CUP: ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించిన భారత్

ఎదురుచూసిన పాక్ మంత్రి

Update: 2025-09-29 02:30 GMT

41 ఏళ్ల ఆసి­యా కప్ టో­ర్నీ చరి­త్ర­లో­నే తొ­లి­సా­రి ఫై­న­ల్ లో తల­ప­డ్డ ఇరు­జ­ట్ల­లో టీమ్ ఇం­డి­యా దే పై­చే­యి.  ఫై­న­ల్ ఇన్నిం­గ్స్ లో 5 వి­కె­ట్ల తే­డా­తో గె­లి­చిం­ది. తె­లు­గు కు­ర్రా­డు తి­ల­క్ వర్మ 69 పరు­గు­ల­తో అద్భుత ఇన్నిం­గ్స్ ఆడా­డు. మ్యా­చ్ ను దగ్గ­రుం­డి గె­లి­పిం­చా­డు.  మరు­పు­రా­ని వి­జ­యా­న్ని సా­ధిం­చిన తర్వాత భా­ర­త్ జట్టు మా­త్రం షా­కిం­గ్ ని­ర్ణ­యం తీ­సు­కుం­ది.  తన తొ­మ్మి­దో ఆసి­యా కప్ టై­టి­ల్ ను తీ­సు­కో­వ­డా­ని­కి ని­రా­క­రిం­చిం­ది. పాక్ మం­త్రి, ఆసి­యా క్రి­కె­ట్ కౌ­న్సి­ల్ అధ్య­క్షు­డి­గా ఉన్న మో­సి­న్ నఖ్వీ చే­తుల మీ­దు­గా ఇస్తుం­డ­డ­మే దీ­ని­కి కా­ర­ణం. వా­ళ్ళ­కు షేక్ ఇవ్వ­డా­ని­కే తాము ఒప్పు­కో­లే­ద­ని దీ­ని­కి ఎలా ఒప్పు­కుం­టా­మం­టూ ట్రో­ఫీ , మె­డ­ల్స్ తీ­సు­కో­కుం­డా­నే టీమ్ ఇం­డి­యా ఆట­గా­ళ్ళు డగౌ­ట్ కు చే­రు­కు­న్నా­రు. 


మాకేం వద్దు మీరే ఉంచుకోండి

పాక్‌ మంత్రి, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్‌ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండడంతో ట్రోఫీని తీసుకోవడానికి పాక్ నిరాకరించింది. ట్రోఫీ, మెడల్స్‌ తీసుకోకుండా టీమ్‌ఇండియా దూరంగా ఉండిపోయారు. దీంతో భారత్‌ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెసెంటేటర్‌ ప్రకటించారు. ఈ నిర్ణయంతో గ్రౌండ్‌కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్ష్ చేసుకున్నారు. ఇక ట్రోఫీ గెలిచిన భారత్‌కు రూ.21 కోట్ల ప్రైజ్‌ మనీ దక్కింది. ఆటగాళ్లు, సిబ్బందికి ఈ డబ్బులు ఇవ్వనున్నారు.


ఎదురుచూసిన పాక్ మంత్రి

పా­కి­స్తా­న్ మం­త్రి నఖ్వీ చాలా సేపు ఎదు­రు చూ­స్తూ­నే ఉన్నా­రు కానీ భారత ఆట­గా­ళ్ళు మా­త్రం పో­డి­యం మీ­ద­కు రా­లే­దు. ఫో­న్లు చూ­స్తూ కిం­ద­నే కా­ల­క్షే­పం చే­శా­రు. భా­ర­త్ ట్రో­ఫీ­ని ని­రా­క­రిం­చి­న­ట్లు ప్రె­సెం­టే­ట­ర్ ప్ర­క­టిం­చా­రు. చి­వ­ర­కు నఖ్వీ ట్రో­ఫీ­ని తీ­సు­కు­ని వె­ళ్ళి­పో­యా­రు. ఆ తరు­వాత టీమ్ ఇం­డి­యా ఆట­గా­ళ్ళు పో­డి­యం దగ్గ­ర­కు వచ్చి సం­బ­రా­లు చే­సు­కు­న్నా­రు. మ్యా­చ్ అనం­త­రం కె­ప్టె­న్ సూ­ర్య కు­మా­ర్ యా­ద­వ్ మా­ట్లా­డు­తూ..తమ వి­జ­యం­తో దేశం మొ­త్తం సం­బ­రా­లఉ చే­సు­కుం­టుం­ద­ని అన్నా­డు. మ్యా­చ్ తరు­వాత జరి­గిన ప్రె­స్ కా­న్ఫ­రె­న్స్ లో సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్, అభి­షే­క్ శర్మ పా­ల్గొ­న్నా­రు. వి­లే­క­రు­లు అడి­గిన పలు ప్ర­శ్న­ల­కు సమా­ధా­నా­లు ఇచ్చా­రు. అం­దు­లో ట్రో­ఫీ­ని తీ­సు­కో­క­పో­వ­డం­పై సమా­ధా­నం ఇస్తూ..తన కె­రీ­ర్ లో ఒక వి­జేత జట్టు ట్రో­ఫీ­ని ని­రా­క­రిం­చ­డం ఇదే మొ­ద­టి సా­ర­ని స్కై అన్నా­డు. తాము అన్ని రకా­లు­గా అర్హు­లే అయి­న­ప్ప­టి­కీ...కా­వా­ల­నే తి­ర­స్క­రిం­చా­మ­ని చె­ప్పా­డు. మి­గ­తా ప్ర­శ్న­ల­న్నిం­టి­కీ సమా­ధా­నం చె­ప్ప­కుం­డా దా­ట­వే­శా­డు.

పహ­ల్గాం ఉగ్ర­దా­డి బా­ధి­తు­ల­తో­పా­టు సై­న్యా­ని­కి ఈ వి­జ­యం అం­కి­తం చే­స్తు­న్న­ట్లు ప్ర­క­టన చే­య­డం­తో పా­క్‌­కు గా­యం­పై కారం పో­సి­నంత పనైం­ది చచ్చీ­చె­డి పా­క్‌ ఫై­న­ల్‌ చే­ర­డం­తో.. ఇక చి­ర­కాల ప్ర­త్య­ర్థుల మ్యా­చ్‌­కు మళ్లీ క్రే­జ్‌ వచ్చిం­ది. దీం­తో ఫై­న­ల్‌ మ్యా­చ్‌­కు స్టే­డి­యం నిం­డి­పో­యిం­ది. ఇక భా­ర­త్‌ ఫై­న­ల్‌­లో గె­లి­స్తే ఆ దేశం నుం­చి ట్రో­ఫీ­తీ­సు­కో­వ­డా­ని­కి భా­ర­త్‌ ని­రా­క­రిం­చ­వ­చ్చ­నే వా­ర్త­లు వచ్చా­యి. అను­కు­న్న­ట్లు­గా­నే భా­ర­త్‌ పా­క్‌ మం­త్రి నఖ్వీ నుం­చి ట్రో­ఫీ తీ­సు­కో­వ­డా­ని­కి ని­రా­క­రిం­చిం­ది. దీంతో ఏ వివాదం చెలరేగుతుందో చూడాలి.

Tags:    

Similar News