భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా బ్యాటర్ మెక్‌స్వీనీ ప్రశంసలు కురిపించారు. బుమ్రాను ఆడటం చాలా కష్టమని పేర్కొన్నారు. ‘ఆయన బౌలింగ్‌లో కష్టపడ్డానన్నది చాలా చిన్నపదం. బుమ్రా అత్యద్భుతమైన బౌలర్. అందరు బౌలర్లలా ఆయన్ను ఆడేయొచ్చని నేను అమాయకంగా పొరబడ్డా. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం. అయితే, బుమ్రా బౌలింగ్‌ను నాలాగే ఇతర బ్యాటర్లు కూడా ఆడలేకపోయారన్నది ఒక్కటే స్వల్ప ఊరట’ అని పేర్కొన్నారు.
గాయాల విషయంలో భారత బౌలర్ బుమ్రా తెలివిగా వ్యవహరించాలని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మెక్‌గ్రాత్ సూచించారు. ‘తను యువకుడు కాదు. వయసు పెరిగే కొద్దీ ఫాస్ట్ బౌలర్లకు గాయాల ప్రమాదం మరింత ఎక్కువ. నేను తక్కువ వేగంతో బౌలింగ్ చేసేవాడిని కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ బుమ్రా వంటి ఫాస్ట్ బౌలర్లు అప్రమత్తంగా ఉండాలి. జిమ్‌లో శరీరాన్ని దృఢపరచుకోవాలి. భారత్‌కు అతడి సేవలు అత్యవసరం’ అని పేర్కొన్నారు