న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కొలిన్ మున్రో చాలామందికి తెలిసిన ఆటగాడే. ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల మున్రో తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాలో జన్మించిన కోలిన్ మున్రో న్యూజిలాండ్ క్రికెట్ లో తనదైన ఆటతో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.
2024 T20 ప్రపంచ కప్ న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో.. కోలిన్ మున్రో రిటైర్మెంట్ నిర్ణయించుకున్నాడు. కోలిన్ మున్రో 2012లో దక్షిణాఫ్రికాతో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. అతడు 122 టీ20 మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో వెస్టిండీస్‌పై మౌంట్ మౌంగానుయ్‌లో 47 బంతుల్లో సెంచరీ సాధించాడు, ఇది ఆ సమయంలో న్యూజిలాండ్‌కు వేగవంతమైన T20 సెంచరీ. ఇది కాకుండా T20 అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా కోలిన్ మున్రో చరిత్ర పుటలలో తన పేరును నమోదు చేసుకున్నాడు.
2016లో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో శ్రీలంకపై మన్రో 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్‌కు ఇది వేగవంతమైన హాఫ్ సెంచరీ.
కొలిన్ మున్రో ఆడిన్ ఈ ఇన్నింగ్స్ ప్రపంచంలో 4వ వేగవంతమైన హాఫ్ సెంచరీ. టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోనప్పటికీ.. న్యూజిలాండ్ క్రికెట్‌కు తన సహకారం ఉంటుందని మున్రో చెప్పడం విశేషం. ఐతే.. లీగ్స్ లో మాత్రం మున్రో కంటిన్యూ కానున్నాడు.