Sri Lankan Cricketer : భార్యాపిల్లల ఎదుటే శ్రీలంక మాజీ క్రికెటర్ దారుణ హత్య
శ్రీలంక అండర్-19 కెప్టెన్‌గా వ్యవహరించిన దమ్మిక నిరోషన ( Dhammika Niroshana ) అనే క్రికెటర్‌ను ఆయన ఇంట్లో భార్యాపిల్లల ఎదుటే గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. అంబలన్‌గోడా ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ ఘోరం చోటుచేసుకుంది. మహారూఫ్, మాథ్యూస్, ఉపుల్ తరంగ వంటి ఆటగాళ్లు అండర్-19 మ్యాచులు దమ్మిక కెప్టెన్సీలోనే ఆడారు. 20 ఏళ్లకే ఆయన క్రికెట్ ఆపేశారు. కాగా.. అండర్‌వరల్డ్ గ్యాంగ్‌వార్‌లే ఈ హత్యకు కారణమని అంచనా వేస్తున్నారు.
దమ్మిక నిరోషన ఓ రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. లోయర్ ఆర్డర్ లో మంచి బ్యాటర్ కూడా. శ్రీలంక తరఫున అండర్ 19 జట్టుకు ఆడినా.. నేషనల్ టీమ్ కు మాత్రం ఎంపిక కాలేకపోయాడు. అతడు మొత్తంగా 2001 నుంచి 2004 మధ్య 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 8 లిస్ట్ ఎ మ్యాచ్ లు ఆడాడు. 300కుపైగా పరుగులు, 19 వికెట్లు తీసుకున్నాడు. రెండేళ్ల పాటు శ్రీలంక అండర్ 19 టీమ్ తరఫున టెస్టులు, వన్డేలు ఆడాడు. ధమ్మిక.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 12 మ్యాచ్‌లు, లిస్ట్-ఏలో 8 మ్యాచ్‌లు ఆడాడు. వరుసగా 19, 5 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకలోని చిలావ్ మారియన్స్ క్రికెట్ క్లబ్, గాలే క్రికెట్ క్లబ్ మరియు సింఘా స్పోర్ట్స్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వచించాడు.