Indian Football Captain : భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్‌గా గుర్‌ప్రీత్ సింగ్
భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్‌గా గోల్ కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ ఎంపికయ్యారు. సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కొత్త కెప్టెన్‌ను నియమించింది. ఫిఫా WC క్వాలిఫయర్స్‌లో భాగంగా రేపు ఖతర్‌తో జరిగే మ్యాచులో గుర్‌ప్రీత్ కెప్టెన్సీ చేయనున్నారు. గతంలో ఛెత్రి ఆడని మ్యాచుల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం అతనికి ఉంది. ఇప్పటివరకు భారత్ తరఫున గుర్‌ప్రీత్ 71 మ్యాచులు ఆడారు.
ప్రస్తుత భారత జట్టులో 32 ఏళ్ల గుర్‌ప్రీత్ సింగ్ సీనియర్ ఆటగాడిగా ఉన్నాడు. ఖతార్‌తో మ్యాచ్‌కు స్టిమాక్ శనివారమే 23 మందితో జట్టును ప్రకటించాడు. శనివారం రాత్రే దోహాకు చేరుకున్న భారత ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్ చేశారు. సోమవారం అధికారిక ప్రాక్టీస్‌లో పాల్గొంటారు.
ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా మంగళవారం ఖతార్‌తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మొదటి సారి మూడో రౌండ్‌కు అర్హత సాధించే అవకాశముంది. 32 ఏళ్ల గుర్‌ప్రీత్ గతంలో ఛెత్రి గైర్హాజరీలో కొన్ని మ్యాచ్‌ల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. అతను ఇప్పటివరకూ 71 మ్యాచ్‌లాడాడు.