Sania Mirza Net Worth : సానియా మీర్జా సంపాదన ఎంత.. ఆమె ఆస్తి ఎన్ని కోట్లు?
Sania Mirza Net Worth : టెన్నిస్ స్టార్ సానియా మిర్జా కీలక ప్రకటన చేసింది.. ఈ ఏడాది చివరి సీజన్ అని ప్రకటించింది.;
Sania Mirza Net Worth : టెన్నిస్ స్టార్ సానియా మిర్జా కీలక ప్రకటన చేసింది.. ఈ ఏడాది చివరి సీజన్ అని ప్రకటించింది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన తర్వాత సానియా ఈ ప్రకటన చేసింది.' కొన్ని రోజులుగా మోకాలు, మోచేయి నొప్పితో బాధపడుతున్నాను. ఆస్ట్రేలియా ఓపెన్ ఓటమికి ఇవే కారణాలని చెప్పదల్చుకోలేదు. అలా అని కెరీర్‌ను పొడిగించనూలేను. తే ఇప్పుడు నా వయస్సు 35. ఈ సీజన్‌ను విజయవంతంగా ముగించడమే నా ముందున్న లక్ష్యం. '' అంటూ సానియా చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సానియా 68వ ర్యాంకులో ఉంది. 2003లో ప్రొఫెషనల్‌గా టెన్నిస్ ఆడడం మొదలు పెట్టిన సానియా మూడు సార్లు మహిళల డబుల్స్ టైటిళ్లు, మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్‌స్లామ్ విజేతగా సానియా మీర్జా నిలిచింది. ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (WTA) ప్రకారం ఇప్పటివరకు ఆమె తన స్పోర్ట్స్ కెరీర్ లో సుమారుగా రూ. 53 కోట్లు గెలుచుకుంది.
హైదరాబాద్‌లోని ఒక విలాసవంతమైన ఇంట్లో సానియా నివసిస్తుంది. ఆమె ఈ ఇంటిని 2012 సంవత్సరంలో కొనుగోలు చేసింది దీని అంచనా విలువ సుమారుగా రూ. 13 కోట్లు వరకు ఉంటుంది.. ఇక ఆమెకు దుబాయ్‌లో విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. ఆమె స్పోర్ట్స్ ద్వారా దాదాపుగా ఏడాదికి మూడు కోట్లు సంపాదిస్తుందని, ప్రకటనల ద్వారా 25 కోట్లకు పైగా సంపాదిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆస్థి విలువ రూ. 184 కోట్లు ఉంటుందని అంచనా. ఇక సానియా మీర్జా కార్ల కలెక్షన్ చాలా పెద్దది. ప్రపంచంలోని కొన్ని లగ్జరీ కార్ బ్రాండ్‌లను ఆమె వాడుతోంది.