INDIA WIN: ఉత్కంఠ ఊపేసింది.. భారత్ గెలిచేసింది
సిరాజ్ అద్భుత ప్రదర్శనతో టీమిండియా అద్భుత విజయం...6 పరుగుల తేడాతో గెలిచిన భారత్;
ఇంగ్లాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టెస్టులో టీమ్ఇండియా సంచలన విజయం సాధించింది. ది ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. విజయం చివరి వరకు అటువైపా.. ఇటువైపా.. అంటూ ఊగిసలాడగా విజయం చివరకు భారత్ ను వరించింది. దీనితో ఈ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. దీంతో సిరీస్‌ను 2-2తో సమమైంది. 374 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 339/6తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ఆరు పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. జేమీ స్మిత్ (2), జేమీ ఒవర్టన్ (9), జోష్ టంగ్ (0)లను భారత బౌలర్లు త్వరగానే వెనక్కి పంపారు. అట్కిన్సన్ (17) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. మహ్మద్ సిరాజ్ 5, ప్రసిద్ధ్ కృష్ణ 4, ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224, ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌటయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 396 పరుగులు చేసింది.
నిప్పులు చెరిగిన సిరాజ్..
ఆఖరి రోజు ఆటలో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతం చేశాడు. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు మూడు వికెట్లు అవసరమవ్వగా.. సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఓవరాల్‌గా సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను జెమీ ఓవర్టన్ రెండు బౌండరీలతో దూకుడుగా ప్రారంభించాడు. కానీ సిరాజ్.. జెమీ స్మిత్(2)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి భారత శిభిరంలో ఆశలు రేకెత్తించాడు. తన మరుసటి ఓవర్లో దూకుడుగా ఆడిన జెమీ ఓవర్టన్(9)ను సిరాజ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. జోష్ టంగ్(0)ను స్టన్నింగ్ యార్కర్‌తో ప్రసిధ్ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారగా.. జట్టు కోసం తీవ్ర గాయంతో క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు దిగాడు. చివరి వికెట్ వోక్స్ బ్యాటింగ్ కు రాగా అట్కిన్సన్ ఒంటరి పోరాటం చేసే భారత శిబిరంలో గుబులు రేపాడు. దీంతో ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరి అభిమానుల్లో ఆందోళన రేపింది.
నరాలు తెగే ఉత్కంఠ
ఈ సమయంలో చివరి టెస్టు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో సిరాజ్ అద్భుత బంతితో అట్కిన్సన్ ను బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ముగిసింది. భారత్ కేవలం ఆరు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోను ఇంగ్లాండ్ సునాయాసంగా గెలిచేస్తుంది అనుకున్నప్పటికీ.. భారత బౌలర్లు అద్భుతం చేశారు. టీమిండియాను 6 పరుగుల తేడాతో గెలిపించారు. టెస్టుల క్రికెట్ చరిత్రలోనే ఇంత తక్కువ తేడాతో గెలవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ లో 224 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. వెటరన్ క్రికెటర్ కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లు అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను అగ్రెసివ్‌గా స్టార్ట్ చేసినా.. ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకొని.. ఇంగ్లండ్‌ను సైతం 247 పరుగులకే ఆలౌట్ చేశారు.
రూట్, బ్రూక్ సెంచరీలు వృథా..
ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(105), హ్యారీ బ్రూక్(111) అద్బుతమైన సెంచరీలతో రాణించారు. ఓ దశలో వీరిద్దరూ తమ జట్టును సునయాసంగా గెలిపించేలా కన్పించారు. కానీ ప్రత్యర్ధి జట్టు వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో కథ తారుమారైంది. ఇంగ్లండ్ ఓటమిపాలవ్వడంతో రూట్, బ్రూక్ సెంచరీలు వృథా అయిపోయాయి. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌ను 247 పరుగులకు ముగించింది. నాలుగో రోజే మ్యాచ్ ముగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, వర్షం కారణంగా నాలుగో రోజు ఆట త్వరగా ముగిసింది. భారత బౌలర్లు ఈ మ్యాచులో అద్భుతంగా పోరాడారు.