Asian Champions : ఏషియన్ చాంపియన్స్ హాకీ ట్రోఫీ.. ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్

Update: 2024-09-16 16:00 GMT

ఏషియన్ చాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో దూకుడుగా ఆడి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్.. దక్షిణ కొరియాతో జరిగిన సెమీస్‌లోనూ సత్తాచాటింది. హర్మన్‌ప్రీత్‌ సేన 4–1 తేడాతో కొరియాపై విజయం సాధించింది. భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్ రెండు, ఉత్తమ్‌ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ చెరో గోల్ చేశారు. కొరియా తరఫున ఏకైక గోల్‌ను జిహున్‌ యంగ్‌ చేశాడు. టోర్నీలో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన పాకిస్థాన్‌కు సెమీస్‌లో చైనా షాక్‌ ఇచ్చింది. తొలుత మ్యాచ్‌ 1–1తో టై అయింది. దీంతో షూటౌట్‌ నిర్వహించారు. ఇందులో చైనా 2-–తో పాక్‌ను ఓడించింది. ఏషియన్ చాంపియన్స్ హాకీ ట్రోఫీలో చైనా ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి.

Tags:    

Similar News