Cricket : ఓటమికి వారిద్దరే కారణం కాదు

Update: 2024-10-28 08:45 GMT

సొంతగడ్డపై భారత్‌కు ఊహించని పరాభవం. పుష్కరకాలం తర్వాత టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. స్వదేశంలో వరుసగా 18 సిరీస్‌లు గెలిచిన టీమిండియా జైత్రయాత్రకు తెరపడింది. పుణె టెస్టులో న్యూజిలాండ్ చేతిలో 113 పరుగుల తేడాతో ఓటమిపాలై మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే చేజార్చుకుంది. 2012 తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోవడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ ఓటమికి ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కారణంగా భావించలేమని పేర్కొన్నాడు. వాళ్లపై నెలకొన్న భారీ అంచనాలతో ప్రతిసారి టెస్టు మ్యాచ్ గెలిపిస్తారని ఆశిస్తామని, కానీ ఓటమికి బాధ్యత వారిద్దరిదే కాదని తెలిపాడు.

Tags:    

Similar News