టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ చేతిలో ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ ( Jos Buttler ) స్పందించారు. స్పిన్నర్లు రషీద్, లివింగ్‌స్టోన్ రాణించినా మరో స్పిన్నర్ మొయిన్ అలీతో బౌలింగ్ చేయించకపోవడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందన్నారు. కఠినమైన పిచ్‌పై 145 నుంచి 150రన్స్‌కే కట్టడి చేయాలని చూశామని, కానీ భారత్ అంతకంటే ఎక్కువ పరుగులు చేసిందన్నారు. టీమ్ ఇండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా ఆడిందని, విజయానికి వారు అర్హులని బట్లర్ అన్నారు.
రెండేళ్ల కింద జరిగిన ఘోర పరాభవానికి టీమ్ ఇండియా రివేంజ్ తీర్చుకుంది. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఇంగ్లండ్ చిత్తుగా ఓడించింది. దీంతో టీమ్ ఇండియా అవమానకరరీతిలో ఆ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆ అవమానానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. ఈ విజయంతో భారత ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై విజయంతో టీమ్ ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ నెల 29న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లు టోర్నీలో ఓటమే లేకుండా ఫైనల్‌కు చేరుకున్నాయి. దీంతో తుది సమరం రసవత్తరంగా జరగనుంది.