ఇండియాపై పాకిస్థాన్ గెలుస్తుందని జోస్యం చెప్పిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీమ్ ఇండియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్ ఫొటోలను Xలో షేర్ చేశారు. ఇది పార్టీ టైమ్ అని ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాలన్నారు. కాగా మహాకుంభమేళాలో ఈ బాబా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
పాక్ చేతిలో భారత్ ఓడిపోతుందని జోస్యం చెప్పిన ఐఐటీ బాబా అలియాస్ అభయ్ సింగ్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ట్విట్టర్ లో #IITianBaba ట్రెండ్ అవుతోంది. ‘విరాట్.. ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఎలా గెలుస్తారో చూద్దాం. అది జరిగి తీరదు’ అని నిన్న ఐఐటీ బాబా అనడంపై ఫైరవుతున్నారు. ‘ఇప్పుడు నీ జోస్యం ఏమైంది?’ అని నిలదీస్తున్నారు. వైరల్ అయ్యేందుకు సొంత దేశం ఓడిపోవాలని కోరుకోవడమేంటని మండిపడుతున్నారు.