టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ ( Rohit Sharma ), విరాట్ కోహ్లీకి ( Virat Kohli ) ఇవాళ జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చివరి మ్యాచ్ అని తెలుస్తోంది. గెలిచినా, ఓడినా వీరిద్దరికీ ఇదే ఆఖరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు వీరిద్దరూ పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. వన్డే, టెస్టుల్లో ఇంకెన్నాళ్లు కొనసాగుతారో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇవాళ టీ20 ప్రపంచకప్-2 ఫైనల్‌లో భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ T20ల్లో ఇరు జట్లు 26 సార్లు తలపడ్డాయి. ఇందులో IND 14, SA 11 సార్లు గెలవగా 1 మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అలాగే ప్రపంచకప్-ల్లో 6 సార్లు తలపడగా టీమ్ ఇండియా 4, సౌతాఫ్రికా 2 సార్లు గెలుపొందాయి. ఏవిధంగా చూసుకున్నా ప్రొటీస్‌పై భారత్‌దే ఆధిపత్యంగా కనిపిస్తోంది. ఇవాళ ఆ జట్టుపై గెలిచి తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ చూస్తోంది.
టీ20 ప్రపంచకప్-2024 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా బెస్ట్ ప్లేయర్లతో ‘టోర్నమెంట్ ఆఫ్ ది టీమ్’ను ఎంపిక చేసింది. 11 మందితో కూడిన ఈ జట్టుకు అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంది. భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించింది. జట్టు: రోహిత్ శర్మ, ట్రావిస్ హెడ్, నికోలస్ పూరన్(WK), ఆరోన్ జోన్స్, స్టొయినిస్, హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్ (C), రిషద్, నోర్ట్జే, బుమ్రా, ఫారూఖీ.