టీ20 వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకుంటోంది. భారత పురుషుల జట్టు కొత్త హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ స్థానం రీప్లేస్ పై క్లారిటీ రాలేదు. కోచ్ పదవికి పోటీలో ఉన్న మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ నియామకం జరిగి పోయిందని చెప్తున్నా అధికారిక ప్రకటన రాలేదు. ఐతే.. జింబాబ్వే పర్యటనలో టీమిండియాకు కోచ్ గా ఉండేది ఎవరు అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది.
జింబాబ్వే టూర్ వెళ్లే భారత జట్టుకు హెడ్ కోచ్ వీవీఎస్ ( VVS Laxman ) ఎంపికయ్యాడని సమాచారం. అయితే.. హెడ్కోచ్ పదవి పట్ల అయిష్టంగా ఉన్న లక్ష్మణ్ తాత్కాలిక కోచ్ గా ఉండేందుకు అంగీకరిస్తాడా? లేదా? తేలాల్సి ఉంది.
జూలైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. జాతీయ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడుగా ఉన్న లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరిస్తాడని చెబుతున్నారు.