ఊహాగాలనాలకు తెరదించుతూ స్టార్ షూటర్ మనూభాకర్‌కు కేంద్ర ప్రభుత్వ ఖేల్ రత్న అవార్డు ప్రకటించింది. అవార్డుకు దరఖాస్తు విషయమై మనూ భాకర్‌కు అవార్డుల కమిటీకి మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్‌లకూ కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. ఈ నెల 17న ప్రదానం చేయనున్నారు.
క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రదానం చేస్తారు. 1991-92 నుంచి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో క్రీడాకారుల ప్రదర్శన ఆధారంగా క్రీడల మంత్రిత్వ శాఖ అవార్డులకు ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి మెడల్, సర్టిఫికెట్‌తోపాటు ₹25 లక్షల నగదు బహుమతిని అందిస్తారు. ఈ ఏడాది మనూభాకర్, గుకేశ్, ప్రవీణ్ కుమార్, హర్మన్‌ప్రీత్‌లను వరించింది.