Kohli :టెస్టులకు కోహ్లి గుడ్ బై .. ట్రాక్ రికార్డులు ఇవే.. !

Update: 2025-05-12 12:15 GMT

క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టులకు గుడ్ బై చెప్పాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బాటలోనే అతడు కూడా వైట్ బాల్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ పై అధికారిక ప్రకటన చేస్తూ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు కోహ్లి. ‘బ్యాగీ బ్లూ ధరించి టెస్టు క్రికెట్లో అడుగుపెట్టి ఇప్పటికి 14 ఏండ్లు గడిచాయి. ఈ ఫార్మాట్లో సుదీర్ఘకాలం కొనసాగుతానని నేను నిజంగా ఊహించలేదు. ఇది ఆటగాడిగా నన్ను ఎంతో పరీక్షించింది.. తీర్చిదిద్దింది. జీవితానికి సరిపడా పాఠాలు నేర్పించింది. వైట్ జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగానూ నా మనసుకు చాలా ప్రత్యేకమైనది. సుదీర్ఘంగా క్రీజులో ఉండటం.. అందులోనూ గుర్తుండిపోయే చిన్న చిన్న పెద్ద జ్ఞాపకాలు ఎప్పటికీ నాతో పాటే ఉంటాయి. ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలకడం మనసుకు భారంగా ఉంది. కానీ, నా నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. ఈ ఫార్మాట్ కోసం నేను ఎంతో ఇచ్చా. నేను ఆశించిన దాని కంటే ఎక్కువే ఇది నాకు తిరిగిచ్చింది. మనస్ఫూర్తిగా.. కృతజ్ఞతా భావంతో దీన్ని నుంచి వైదొలుగుతున్నా. క్రికెట్ కు, నా సహచర ఆటగాళ్లకు, నా ప్రయాణాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేలా చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. టెస్టు కెరీర్ సంతృప్తికరం. వెనక్కి తిరిగి నా టెస్టు కెరీర్ను చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కన్పిస్తుంది. ప్రేమతో #269.. ఇక సెలవు” అంటూ కోహ్లి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు.

2011లో వెస్టిండీస్ పై అరంగేట్రం

2011లో వెస్టిండీస్పై టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన కోహ్లి.. కెరీర్లో 123 టెస్టు మ్యాచ్లు ఆడి 9,230 రన్స్ (46.85 బ్యాటింగ్ యావరేజ్) చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో వి రాట్ హయ్యెస్ట్ స్కోరు 254 రన్స్. కెప్టెన్ గానూ సంప్రదాయ క్రికెట్ లో భారత్ ను టాప్ లో నిలిపాడు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లి చివరి టెస్టు ఆడాడు. టెస్టుల్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ ..10 వేల పరుగులు మైలురాయికి కొద్ది దూరంలోనే నిలిచి.. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే టీ 20లకు రిటైర్ మెంట్ ప్రకటించిన విరాట్ ఇకపై కేవలం వన్డే ల్లోనే కనిపించనున్నాడు. 

Tags:    

Similar News