టీ20 వరల్డ్ కప్ ను సాధించిన టీమిండియాను దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulakr ) అభినందించాడు. ఆటగాళ్లు, కోచ్ సిబ్బంది పోరాట పటిమను కొనియాడాడు. పోగొట్టుకున్న చోటే వెతుకున్నట్లుగా 2007లో ఎదురైన చేదు జ్ఞాపకాలు చెరిపేసి, చరిత్ర సృష్టించారని అన్నాడు. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి గర్వకారణమైన విజయంసాదించింది.
సచిన్ టెండూల్కర్ భారత ఆటగాళ్లను, కోచ్ సిబ్బందిని కొనియాడుతూ ట్వీట్ చేశాడు. "టీమిండియా జెర్సీలో జత అవుతున్న ప్రతి స్టార్ భారత దేశ పిల్లల్లో స్ఫూర్తి నింపేలా, వాళ్ల కలలు సాకారం చేసుకోవడానికి ప్రేరణలా ఉంటాయి. భారత్ కు ఇది నాలుగో కప్. టీ20 వరల్డ్ కప్ పరంగా ఇది రెండోది" "వెస్టిండీస్ లో భారత క్రికెట్ ప్రయాణం గొప్పది. 2007 వన్డే వరల్డ్ కప్ వైఫల్యం..2024 నాటికి పవర్ హౌస్ లా మారి 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచేలా చేసింది. నా స్నేహితుడు రాహుల్ ద్రవిడ్ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. 2011 వన్డే వరల్డ్ కప్లో ద్రవిడ్ మిస్ అయినప్పటికీ, ఈ టీ20 ప్రపంచకప్ గెలవడంలో అతను సాయం అపారమైంది." అన్నారు.
"రోహిత్ గురించి ఏం చెప్పాలి? సూపర్బ్ కెప్టెన్సీ. 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమి బాధను అధిగమించి, టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతూ, జట్టు నడిపిన తీరు అమోఘం. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లి అందుకోవడమే పర్ఫెక్ట్. ఈ అవార్డులకు వాళ్లు అర్హులు. కీలక మ్యాచ్ లో వాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. ఇది అందరి గెలుపు. అభినందనలు." అని సచిన్ ట్వీట్ చేశాడు.