Cricketer Retirement : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మాథ్యూ వేడ్

Update: 2024-03-15 09:14 GMT

ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ వేడ్ (Mathew Wade) టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డేలు, టీ20ల్లో కొనసాగుతానని వెల్లడించారు. ‘‘సంప్రదాయ ఫార్మాట్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. వైట్‌బాల్‌ క్రికెట్‌లో కొనసాగినా.. బ్యాగీ గ్రీన్‌తో దేశం తరఫున బరిలోకి దిగడమే నా కెరీర్‌లో ఎప్పటికైనా హైలైట్‌గా నిలుస్తుంది’’ అని మాథ్యూ వేడ్‌ ఉద్వేగపూరిత ప్రకటన చేశాడు.

జూన్‌లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌ కోసం ఆసీస్ జట్టుకు అందుబాటులో ఉంటానన్నారు మాథ్యూ వేడ్ . ఐపీఎల్‌లో గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వేడ్.. ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కాగా 2012లో ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టిన 36 టెస్టులు ఆడిన వేడ్ 29.87 సగటుతో 1613 రన్స్ చేశారు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.

ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌ విషయానికొస్తే.. టీ20 ఫార్మాట్లో ఫినిషర్‌గా వేడ్‌ గుర్తింపు పొందాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీలో ఆస్ట్రేలియా టైటిల్‌ గెలవడంలో అతడిదే కీలక పాత్ర. పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్లో కేవలం 17 బంతుల్లోనే 41 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్‌ అది!

Tags:    

Similar News