ఇండియన్ స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తాను గాయపడినట్టు వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు. గాయం కారణంగానే 'ఒస్ట్రవా గోల్డెన్ స్పీక్ అథ్లెటిక్స్ మీట్స్' నుంచి వైదొలిగానే ప్రచారంలో నిజం లేదని అన్నాడు. తానేమీ తీసుకోవద్దనే ఉద్దేశంతోనే టోర్నీ నుంచి తప్పుకున్నాని ఈ ఒలింపియన్ వెల్లడించాడు. అభి మానులు 'హమ్మయ్యా' అని ఊపిరి పీల్చుకున్నారు.
ఒస్ట్రవా గోల్డెన్ సీక్ అథ్లెటిక్స్ మీట్స్ నిర్వాహకులు ఆదివారం చోప్రా గాయపడ్డాడని, అతడు అతిథిగా ఈ టోర్నీలో పాల్గొంటాడని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ కాసేపటికే నీరజ్ తన గైర్హాజరీపై క్లారిటీ ఇచ్చాడు. 'నేను మళ్లీ గాయపడలేదు. మరో నెలరోజుల్లో ఒలింపిక్స్ ఉన్నందున రిస్క్ తీసుకోవద్దనే ఆలోచనతోనే ఒస్త్రవా గోల్డెన్ స్పీక్ అథ్లెటిక్స్ మీట్స్ పోటీలకు దూరమయ్యా. పాత గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక మళ్లీ పోటీల్లో పాల్గొంటా' అని నీరజ్ తెలిపాడు.
నిరుడు ఆసియా క్రీడల్లో స్వర్ణం, ఈ ఏడాది డైమండ్ లీగ్లో పసిడి తో ప్రకంపనలు సృష్టించాడు. దాంతో, ప్యారిస్ ఒలింపిక్స్ లోనూ రికార్డు బద్దలు కొట్టాలనే కసితో ఉన్నాడు. నీరజ్ చోప్రా మంచి నిర్ణయం తీసుకున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.