భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం T20 వరల్డ్ కప్ తో ముగియనుంది. దీంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే.. న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం, చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో బోర్డు పెద్దలు చర్చించినట్లు తెలుస్తోంది. చాలారోజులుగా ఆయన భారత ప్లేయర్లను, పరిస్థితులను దగ్గరగా చూస్తున్న అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోందట. కాగా, మే 27న కోచ్ పదవికి దరఖాస్తు గడువు ముగియనుంది.
రాహుల్ ద్రవిడ్ వారసుడిగా ఫ్లెమింగ్ సరైనోడని బీసీసీఐ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అతడితో బీసీసీఐ పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఫ్లెమింగ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అతడికి కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది.
అతడి నేతృత్వంలోనే సీఎస్‌కే ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచింది. అయితే బీసీసీఐ నిబంధనలను అతడు ఒప్పుకుంటాడో లేదే చూడాలి. బీసీసీ రూల్స్ ప్రకారం.. కొత్త ప్రధాన కోచ్ మూడు ఫార్మాట్‌లో భారత జట్టును ముందుకు నడిపించాలి.