PV Sindhu : సింధు దూకుడు.. మలేషియా టోర్నీలో ఆశలు

Update: 2024-05-23 06:32 GMT

మలేసియా మాస్టర్స్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. పారిస్ ఒలిం పిక్స్ సన్నహాకాల్లో భాగంగా ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ కు దూరమైన సింధు మలేసియా మాస్టర్ ను విజయంతో ఆరంభించింది.

మన షెట్లర్లు అష్మిత, కిరణ్ జార్జ్ లు కూడా ముందంజ వేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 5వ సీడ్ సింధు 21-17, 21-16 తేడాతో స్కాట్లాండ్ షట్లర్ కిరీ స్పీగిల్మెర్ ను వరస గేముల్లో చిత్తు చేసి ప్రీ క్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన సింధు ప్రతర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ 46 నిమిషాల్లోనే ఏకపక్షంగా మ్యాచ్ ను ముగించింది.

తర్వాతి మ్యాచ్లో సింధు దక్షిణ కొరియాకు చెందిన సీమ్ యు జిన్ తో తలపడనుంది.

Tags:    

Similar News