T20 Records : టీ20ల్లో అరుదైన రికార్డు

Update: 2024-06-22 08:02 GMT

దక్షిణాఫ్రికా ప్లేయర్ నోకియా ( Anrich Nortje ) టీ20ల్లో వరుసగా 16 ఇన్నింగ్సుల్లో కనీసం ఒక వికెట్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచారు. 2021-24 మధ్య కాలంలో ఆయన ఈ ఘనత అందుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో గ్రేమ్ స్వాన్(15 ఇన్నింగ్సులు), జంపా*(15 ఇన్నింగ్సులు), సోది(11 ఇన్నింగ్సులు) ఉన్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా తరఫున టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు(31) తీసిన బౌలర్‌గా నోకియా నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో డేల్ స్టెయిన్(30) ఉన్నారు.

టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఇంగ్లండ్‌కు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. సఫారీ బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 163 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో డికాక్(65), మిల్లర్(43) అదరగొట్టారు. ఛేదనలో ఇంగ్లండ్ 61కే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్రూక్(53), లివింగ్‌స్టోన్(33) పోరాడినా ఫలితం లేకపోయింది.

ఇంగ్లీష్ జట్టు విజయానికి చివరి 3 ఓవర్లలో 25 పరుగులే అవసరం అవవ్వడంతో విజయం ఖాయం అనుకున్నారు. రబాడ అద్భుతంగా బౌలింగ్ చేసి లివింగ్‌స్టన్‌ను ఔట్ చేసి 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 19వ అవర్లో జాన్సెన్ 9 రన్స్ ఇవ్వగా.. చివరి ఓవర్లో నోకియా 6 పరుగులే ఇచ్చాడు.

Tags:    

Similar News