Yuvraj Singh : రోహిత్ గొప్ప కెప్టెన్..నేనిప్పటి వరకు చూడలేదు : యువరాజ్

Update: 2025-01-13 15:15 GMT

రోహిత్ శర్మ ఎప్పటికీ గొప్ప కెప్టెనే అని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. ‘రోహిత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా వన్డే ప్రపంచకప్ ఫైనల్ కు వెళ్లింది. టీ20 ప్రపంచకప్ గెలిచింది. ఫామ్ లేమి కారణంగా మ్యాచ్ నుంచి తనకు తానుగా తప్పుకున్న సారథిని నేనిప్పటి వరకు చూడలేదు. తన తొలి ప్రాధాన్యత జట్టేనని రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే అతడి గొప్పతనం’ అని కొనియాడారు.

విరాట్, రోహిత్ గతంలో సాధించిన విజయాలను ఎవరూ మరిచిపోకూడదని యువరాజ్ చెప్పాడు. “మనం గ్రేట్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి మాట్లాడుతున్నాం. వారిని కొందరు విమర్శిస్తున్నారు. గతంలో వారు ఏం సాధించారో జనాలు మరిచిపోతున్నారు. ప్రస్తుత తరంలో వారు గొప్ప క్రికెటర్లలో ఉన్నారు. వాళ్ల ఓడారు. సరిగా ఆడలేదు. ఈ విషయంలో మనకంటే వారే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు” అని పీటీఐ ఇంటర్వ్యూలో యువరాజ్ అన్నాడు. విరాట్, రోహిత్ తనకు కుటుంబ సభ్యుల్లాంటి వారని, వాళ్లిద్దరూ మళ్లీ అదరగొడతారనే నమ్మకం ఉందని చెప్పాడు. 

Tags:    

Similar News