టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచుల్లో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. అలాగే టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక ఫోర్లు బాదిన తొలి ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ (113) నిలిచారు. ఈ క్రమంలో ఆయన మహేల జయవర్ధనే (111) రికార్డును అధిగమించారు.
స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో 5,000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో టీమ్ ఇండియా కెప్టెన్‌గా నిలిచారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 12,833 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ధోని(11,207), అజహరుద్దీన్(8,095), గంగూలీ(7,643) ఉన్నారు. మరోవైపు టీ20WC ఒక ఎడిషన్‌లో అత్యల్ప బ్యాటింగ్ సగటు(10.71) నమోదు చేసిన భారత ఓపెనర్‌గా కోహ్లీ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు.
టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆనందంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు. డగౌట్‌లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సహచర ఆటగాళ్లు ఆయనను ఓదారుస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రోహిత్ ఐసీసీ టోర్నమెంట్లలో 27 మ్యాచ్‌లకు సారథ్యం వహించారు. అందులో 24 మ్యాచుల్లో జట్టును గెలిపించారు. 4 మ్యాచుల్లో ఓటమిపాలయ్యారు. విన్నింగ్ పర్సంటేజీ 81.47%గా ఉంది.