రోహిత్ శర్మ చేసిన విమర్శలపై ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ స్టార్స్ స్పోర్ట్స్ స్పందించింది. తమ ప్రైవసీని స్టార్ స్పోర్ట్స్ గౌరవించలేదని రోహిత్ శర్మ చేసిన విమర్శలకు స్టార్ స్పోర్ట్స్ వివరణ ఇచ్చింది. మే 16న వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు ముందు బౌండరీ లైన్ వెంబడి ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, అతని స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ నుండి ఎలాంటి ఆడియోను రికార్డ్ చేయలేదని బ్రాడ్‌కాస్టర్ తెలిపింది.
తాము ఆటగాళ్ల ప్రైవసీని గౌరవిస్తామని స్టార్ స్పోర్ట్స్ వివరణ ఇచ్చింది. ఆటగాళ్ల మధ్య జరిగే ప్రైవేట్ సంభాషణలను ప్రసారం చేయడం వల్ల అభిమానులు, క్రికెట్ మధ్య విశ్వాసం దెబ్బతింటుందని రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా స్టార్ స్పోర్ట్స్ నుండి ప్రకటన వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను ప్రసారం చేస్తున్నప్పుడు స్టార్ స్పోర్ట్స్ ఎల్లప్పుడూ వృత్తిపరమైన ప్రవర్తన, అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.