భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ( Sania Mirza ) ఫ్యామిలీతో కలిసి పవిత్ర హజ్ యాత్రకు బయల్దేరారు. దివ్యమైన ఈ అవకాశాన్ని భగవంతుడు తనకు అందించారని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేశారు. ‘పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే అవకాశం లభించింది. కొత్త అనుభూతికి సిద్ధమవుతున్నా. నేను ఏవైనా తప్పులు చేసుంటే క్షమించాలని కోరుతున్నా. అల్లా నా ప్రార్థనలను ఆలకించి సన్మార్గంలో తీసుకెళ్తారని నమ్ముతున్నా’ అని ఆమె రాసుకొచ్చారు.
హజ్ యాత్రకు వెళ్లే దివ్యమైన అవకాశాన్ని ఆ భగవంతుడు తనకు అందించాడని సానియా వెల్లడించారు. తన జీవిత పరివర్తన అనుభూతికి సిద్ధమవుతున్నానని, ఆధ్యాత్మిక భావనలతో తన హృదయం నిండిపోయిందని తెలిపారు. అందుకు కృతజ్ఞురాలినని పేర్కొన్నారు.
తాను ఏవైనా తప్పిదాలకు, పొరపాట్లకు పాల్పడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుతున్నట్టు సానియా వివరించారు. అల్లా నా ప్రార్థనలను ఆలకిస్తాడని నమ్ముతున్నానని, నన్ను సన్మార్గంలో తీసుకెళతాడన్న నమ్మకంతో ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.