World Cricket Records : ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం.. 4కి 4 ఓవర్లు మెయిడిన్
ప్రపంచ క్రికెట్‌లో సంచలనం నమోదైంది. న్యూజిలాండ్ బౌలర్ ఫెర్గూసన్ ( Lockie Ferguson ) 4 ఓవర్లు వేసి ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. 4కి 4 ఓవర్లు మెయిడిన్ అయ్యాయి. అంతేకాదు 3 వికెట్లూ పడగొట్టారు. అతడి గణాంకాలు 4-4-0-3గా ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు ఇవే. పపువా న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచులో కివీస్ పేస్ బౌలర్ ఈ రికార్డు అందుకున్నారు. గతంలో కెనడా బౌలర్ సాద్ బిన్ జఫర్ కూడా 4 మెయిడిన్ ఓవర్లు వేసి, 2 వికెట్లు తీశారు.
వరల్డ్ కప్‌లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇదే వేదికపై మూడు రోజుల కిందట ఉగాండాపై తన టీమ్‌మేట్ టిమ్ సౌథీ (3/4) నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తంగా ఇంటర్నేషనల్ టీ20ల్లో నాలుగు ఓవర్లనూ మెయిడిన్ చేసిన రెండో బౌలర్ ఫెర్గూసన్. కెనడా బౌలర్ సాద్ బిన్ జాఫర్ (4–4–0–2) 2021లో పనామాపై తొలిసారి ఈ ఘనత సాధించాడు