బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 14,000 పరుగులతోపాటు 700 వికెట్లు (అన్ని ఫార్మాట్లలో కలిపి) తీసిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించారు. యూఎస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. కాగా ఇప్పటివరకు 48 మంది బ్యాటర్లు 14,000 పరుగులు చేశారు. 17 మంది బౌలర్లు 700 వికెట్లు పడగొట్టారు. కానీ ఈ రెండింటిని సాధించిన ఒకే ఒక్క ప్లేయర్‌గా షకీబ్ నిలిచారు.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా యూఎస్‌ఏతో జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ 2-1 తేడాతో సిరీస్‌ను కోల్పోగా.. ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాట్‌తో 17000 కంటే ఎక్కువ పరుగులు, 700 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దీనికి సంబంధించిన ప్రశంసల పోస్ట్‌ను షేర్ చేసింది.