టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో ( Smriti Mandana ) రిలేషన్‌ను మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్ఛల్ అధికారికంగా ప్రకటించారు. తమ ప్రేమ బంధానికి ఐదేళ్లు పూర్తయ్యాయని తెలుపుతూ వారిద్దరూ కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌కు మంధాన లవ్ సింబల్స్‌తో కామెంట్ చేసింది. కాగా స్మృతి, పలాష్ పలుమార్లు కలిసి కనిపించినా తమ బంధంపై ఎప్పుడూ నోరువిప్పలేదు.
గతంలో ఓ సందర్భంలో తాను ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందో చెప్పింది స్మృతి మందాన. తాను చేసుకోబోయేవాడు మంచి మనసున్న వాడై ఉండాలని, తనను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. అలాగే తన కెరీర్‌ను అర్థం చేసుకోవాలని, కెరీర్ బిజీలో పడిపోయి కొన్నిసార్లు సమయం కేటాయించలేకపోయినా, తనను అర్ధం చేసుకుని, ప్రోత్సహించేవాడినే మనువాడతానని చెప్పుకొచ్చింది.