టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన సౌతాఫ్రికా జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. దక్షిణాఫ్రికా జట్టుకు ఐడెన్ మార్‌క్రమ్ కెప్టెన్ . టీ20 కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత ఐసీసీ ఈవెంట్‌లో మొదటిసారిగా దక్షిణాఫ్రికాకు మార్‌క్రమ్ నాయకత్వం వహించనున్నాడు. ప్రపంచకప్ జట్టులో ఇద్దరు అన్ క్యాప్డ్ టీ20 ప్లేయర్స్, సెంట్రల్ కాంట్రాక్ట్ లేని ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది.
ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్‌లు కూడా మెగా ఈవెంట్లో భాగం కానున్నారు. కాగా జూన్ 1న ప్రపంచకప్‌నకు తెరలేవనుండగా.. జూన్ 3న సౌతాఫ్రికా న్యూయార్క్ వేదికగా శ్రీలంకతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నో