ఐపీఎల్‌లో భాగంగా నేడు ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లూ 12 పాయింట్ల మీద ఉన్నాయి. ఢిల్లీకి ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా.. లక్నోకు ముంబైతో మరో మ్యాచ్ మిగిలుంది. అయితే హైదరాబాద్ తో ఓటమి తర్వాత లక్నో రన్ రేట్ ఘోరంగా పడిపోయింది. దీంతో ప్లేఆఫ్స్ బెర్త్ అనుమానమే. ఇక ఢిల్లీ ఈరోజు గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కు ఎంతోకొంత ఛాన్స్ ఉంటుంది. ఓడితే ఢిల్లీ కూడా ఇంటికే.
ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. లక్నో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 6 గెలిచి, అదే సంఖ్యలో ఓడింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 7 ఓడింది. ఢిల్లీకి కూడా 12 పాయింట్లు ఉన్నాయి. కానీ, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఆరో స్థానంలో, లక్నో ఏడో స్థానంలో నిలిచాయి. అందుకే ఢిల్లీకి ఇది డూ ఆర్ డై పోటీ.
ఆర్సీబీతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తమ బ్యాటింగ్ ఆర్డర్‌లో పంత్ చాలా కీలకమని ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గంగూలీ పేర్కొన్నారు. అతడు లేకపోవడం ఓటమికి ప్రధాన కారణమని చెప్పారు. ఇక.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు మంచి అవకాశాలే ఉన్నాయని ఆయన అంచనా వేశారు. రోహిత్ శర్మ ఫామ్ గురించి ఆందోళన అక్కర్లేదని, పెద్ద టోర్నమెంట్లలో శర్మ రాణిస్తారని గంగూలీ ధీమా వ్యక్తం చేశారు.