VAIBHAV: ప్రపంచ క్రికెట్‌లో వైభవ్ ప్రకంపనలు

వరుస శతకాలతో చెలరేగుతున్న వైభవ్...విజయ్ హజారేలో బౌలర్ల ఊచకోత...ఆసియా కప్ అండర్ 19లోనూ సత్తా

Update: 2025-12-26 06:30 GMT

క్రి­కె­ట్ హి­స్ట­రీ­లో వై­భ­వ్ సూ­ర్య­వం­శీ అద్భు­తం అంటూ ది­గ్గజ క్రి­కె­ట­ర్స్ కి­తా­బి­స్తు­న్నా­రు. భారత క్రి­కె­ట్ కు స్టా­ర్ క్రి­కె­ట­ర్ అంటూ 14 ఏళ్ల సూ­ర్య­వం­శీ­పై ప్ర­శం­స­లు కు­రి­పి­స్తు­న్నా­రు. వి­జ­య్ హజా­రే ట్రో­ఫీ అరం­గే­ట్రం­లో అరు­ణా­చ­ల్ ప్ర­దే­శ్‌­పై 84 బం­తు­ల్లో 190 పరు­గు­లు చేసి బి­హా­ర్ యువ బ్యా­ట్స్‌­మ­న్ వై­భ­వ్ సూ­ర్య­వం­శీ క్రి­కె­ట్ ప్ర­పం­చా­న్ని ఆశ్చ­ర్య­ప­రి­చా­డు. అం­డ­ర్-19 ఆసి­యా కప్ ఫై­న­ల్‌­లో వి­ఫ­ల­మైన కొ­ద్ది రో­జుల తర్వాత ఆడిన ఈ ఇన్నిం­గ్స్, సూ­ర్య­వం­శీ­ని త్వ­ర­లో సీ­ని­య­ర్ భారత జట్టు­లో చే­ర్చా­లా వద్దా అనే చర్చ­కు దా­రి­తీ­సిం­ది. వై­భ­వ్ వి­ధ్వం­సక బ్యా­టిం­గ్ కా­ర­ణం­గా, బీ­హా­ర్ జట్టు 6 వి­కె­ట్ల­కు 574 పరు­గు­లు చే­సిం­ది. ఇది వి­జ­య్ హజా­రే ట్రో­ఫీ చరి­త్ర­లో అత్య­ధిక జట్టు స్కో­రు. ఈ ప్ర­ద­ర్శన అభి­మా­ను­ల­ను, క్రి­కె­ట్ ని­పు­ణు­ల­ను, మాజీ ఆట­గా­ళ్ల­ను ఆశ్చ­ర్య­ప­రి­చిం­ది. సీ­ని­య­ర్ దే­శ­వా­ళీ క్రి­కె­ట్‌­లో ఇంత చి­న్న వయ­స్సు­లో ఇంత ఆధి­ప­త్యం చాలా అరు­దు. వై­భ­వ్ సూ­ర్య­వం­శీ కే­వ­లం 36 బం­తు­ల్లో­నే సెం­చ­రీ సా­ధిం­చి, పు­రు­షుల లి­స్ట్ ఎ క్రి­కె­ట్‌­లో సెం­చ­రీ చే­సిన అతి పి­న్న వయ­స్కు­డి­గా ని­లి­చా­డు. వై­భ­వ్ అక్క­డి­తో ఆగ­లే­దు. 59 బం­తు­ల్లో 150 పరు­గు­లు సా­ధిం­చి, పు­రు­షుల లి­స్ట్ ఎ క్రి­కె­ట్‌­లో అత్యంత వే­గ­వం­త­మైన 150 పరు­గుల రి­కా­ర్డు­ను నె­ల­కొ­ల్పా­డు. గతం­లో, ఈ రి­కా­ర్డు ఎబి డి­వి­లి­య­ర్స్ పే­రిట ఉంది. వై­భ­వ్ 84 బం­తు­ల్లో 190 పరు­గు­ల­కు అవు­ట్ అయ్యే సమ­యా­ని­కి, 16 ఫో­ర్లు, 15 సి­క్స­ర్లు కొ­ట్టా­డు. వై­భ­వ్ చా­రి­త్రా­త్మక ఇన్నిం­గ్స్‌­తో ఆక­ట్టు­కు­న్న వా­రి­లో కాం­గ్రె­స్ ఎంపీ, క్రి­కె­ట్ ఔత్సా­హి­కు­డు శశి థరూ­ర్ కూడా ఉన్నా­రు. సో­ష­ల్ మీ­డి­యా ప్లా­ట్‌­ఫా­మ్ Xలో వై­భ­వ్ సూ­ర్య­వం­శీ­ని సచి­న్ టెం­డూ­ల్క­ర్‌­తో పో­ల్చి, చి­వ­రి­సా­రి­గా 14 ఏళ్ల బా­లు­డు ఇంత అసా­ధా­రణ ప్ర­తి­భ­ను ప్ర­ద­ర్శిం­చి­న­ది సచి­న్ అని రా­సు­కొ­చ్చా­రు.

16 ఫోర్లు, 15 సిక్సర్లు

వి­జ­య్ హజా­రే ట్రో­ఫీ­లో బీ­హా­ర్ జట్టు అరు­ణా­చ­ల్ ప్ర­దే­శ్‌­పై రి­కా­ర్డు వి­జ­యం సా­ధిం­చిం­ది. రాం­చీ­లో జరి­గిన ఈ మ్యా­చ్‌­లో బీ­హా­ర్ 397 పరు­గుల తే­డా­తో గె­లి­చి వి­జ­య్ హజా­రే ట్రో­ఫీ చరి­త్ర­లో అతి­పె­ద్ద వి­జ­యా­ల్లో ఒక­టి­గా ని­లి­చిం­ది. ముం­దు­గా బ్యా­టిం­గ్ ఎం­చు­కు­న్న బీ­హా­ర్ ని­ర్ణీత 50 ఓవ­ర్ల­లో 6 వి­కె­ట్ల నష్టా­ని­కి 574 పరు­గుల భారీ స్కో­రు సా­ధిం­చిం­ది. ఇది వి­జ­య్ హజా­రే ట్రో­ఫీ చరి­త్ర­లో అత్య­ధిక జట్టు స్కో­రు­గా ని­లి­చిం­ది. ఇక బీ­హా­ర్ ఇన్నిం­గ్స్ లో ఓపె­న­ర్ వై­భ­వ్ సూ­ర్య­వం­శీ ఎప్ప­టి­లా­గే ప్ర­త్య­ర్థి బౌ­ల­ర్ల­పై వి­రు­చు­క­ప­డా­డ్డు. వై­భ­వ్ కే­వ­లం 84 బం­తు­ల్లో 16 ఫో­ర్లు, 15 సి­క్స­ర్ల ధనా­ధ­న్ ఇన్నిం­గ్స్‌­తో 190 పరు­గు­లు చేసి తృ­టి­లో డబు­ల్ సెం­చ­రీ మిస్ చే­సు­కు­న్నా­డు. ప్లే­య­ర్ ఆఫ్ ది మ్యా­చ్ అవా­ర్డు అం­దు­కు­న్న వై­భ­వ్.. మం­గ­ళ్ మహ్రూ­ర్ (33)తో కలి­సి తొలి వి­కె­ట్‌­కు 158 పరు­గు­లు జో­డిం­చా­డు. ఆ తర్వాత పి­యూ­ష్ సిం­గ్ (77), అయూ­ష్ లో­హ­రు­కా (116), కె­ప్టె­న్ సకి­బు­ల్ గనీ (128*) అరు­ణా­చ­ల్ ప్ర­దే­శ్‌ బౌ­ల­ర్ల­ను ఓ ఆట ఆదు­కు­న్నా­రు. అరు­ణా­చ­ల్ బౌ­ల­ర్ల­లో టీ­ఎ­న్‌­ఆ­ర్ మో­హి­త్ 2 వి­కె­ట్లు, టెచి నేరి 2 వి­కె­ట్లు తీ­శా­రు. మి­బో­మ్ మోసు కే­వ­లం 9 ఓవ­ర్ల­లో 116 పరు­గు­లు ఇచ్చా­డు. రి­కా­ర్డు 575 పరు­గుల భారీ లక్ష్య ఛే­ద­న­లో అరు­ణా­చ­ల్ ప్ర­దే­శ్ కు­ప్ప­కూ­లిం­ది.

Tags:    

Similar News