VHT: విజయ్ హజారే ట్రోఫీలో మెరుపులు

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శతకాలతో అభిమానుల్లో సంబరం

Update: 2025-12-25 03:00 GMT

భారత క్రికెట్‌ను దశాబ్దాలుగా శాసిస్తున్న దిగ్గజాలు రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ విజయ్ హాజారే ట్రోఫీలో సత్తాచాటారు. ఈ మెగా టోర్నీలో శతకాలు సాధించి తమ క్లాస్ ఏమిటో మరోసారి నిరూపించారు. విజయ్ హజారే ట్రోఫీ ఈసారి అభిమానులకు అంతర్జాతీయ మ్యాచ్‌ల స్థాయిలో ఉత్కంఠను అందిస్తోంది. జైపూర్ వేదికగా సిక్కిం - ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. ఆంధ్రాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ శతకం బాదాడు.

దేశవాళీలోనూ రో"హిట్"

సిక్కిం - ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలో జాగ్రత్తగా ఆడుతూ బంతిని అర్థం చేసుకున్న రోహిత్, తర్వాత క్రమంగా వేగం పెంచాడు. కవర్ డ్రైవ్‌లు, పుల్ షాట్లు, లాఫ్టెడ్ షాట్లతో బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. సెంచరీ పూర్తయ్యాక కూడా రోహిత్ అదే దూకుడు కొనసాగించాడు. అతని సెంచరీ జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. రోహిత్ శర్మను చూసేందుకు జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియానికి వేలాది మంది ప్రేక్షకులు తరలివచ్చారు. దాదాపు 3 వేల మందికి మాత్రమే సరిపోయే విధంగా స్టేడియంలో ఏర్పాట్లు చేశారు నిర్వాహాకులు. అయితే దాదాపు 10 వేల మంది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చినట్టుగా అధికారిక సమాచారం..

కోహ్లీ కూడా..

ఆంధ్రాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన ఫామ్ చాటాడు. ఆంధ్రాతో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ అందుకున్నాడు. 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ, లిస్టు A క్రికెట్‌లో అత్యంత వేగంగా 16 వేల పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు... ఈ మ్యాచ్‌కి ప్రేక్షకులకు అనుమతి లేదు. అభిమానుల నుంచి విపరీతమైన డిమాండ్ రావడంతో ఆంధ్రా వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌ని యూట్యూబ్‌లో ప్రత్యేక్ష ప్రసారం చేసింది బీసీసీఐ.

Tags:    

Similar News