ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ వరకు భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతారని తెలుస్తోంది. ఆ తర్వాత కెప్టెన్సీ మార్పు ఉంటుందని బీసీసీఐ వర్గాల సమాచారం. దీనిపై బీసీసీఐ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిందని టాక్. కాగా గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ భారత్ పేలవ ప్రదర్శన చేసింది. రోహిత్ సారథ్యంలో టీమ్ ఇండియా 1-3 తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. దీంతో కెప్టెన్‌ను మార్చాలని డిమాండ్లు వినిపించాయి.
రోహిత్.. అత్యుత్తమం: డీకే
‘‘రోహిత్ శర్మ అత్యుత్తమ నాయకుల్లో ఒకరు. అందులో ఏ సందేహం లేదు. గొప్ప లెగసీని వదిలి వెళ్తాడు. ధోనీ, కపిల్‌దేవ్ ఒక్కో తరంలో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అదే బాటలో పయనించాడు. వ్యక్తిగతంగానూ రోహిత్ చాలా చమత్కారంగా ఉంటాడు. రిటైర్‌మెంట్‌పై అతడు స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం’’ అని భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ వ్యాఖ్యానించాడు.