WWC: మహిళా ప్రపంచకప్‌..నేడు భారత్-పాక్ పోరు

నో షేక్ హ్యాండ్ కంటిన్యూ..

Update: 2025-10-05 04:30 GMT

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో శుభారంభం చేసిన భారత్.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. నేడు కొలంబో వేదికగా జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్‌లో దాయాదీ పాకిస్థాన్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు దేశాల మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే ముగిసిన పురుషుల ఆసియా కప్ 2025 టోర్నీలో ఇరు జట్ల మధ్య అనేక వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి.

నో షేక్ హ్యాండ్ కంటిన్యూ..

పా­కి­స్థా­న్‌ ఆట­గా­ళ్ల­తో భారత ప్లే­య­ర్స్ కర­చా­ల­నం చే­య­లే­దు. ఇరు జట్లు ఐసీ­సీ­కి ఒక­రి­పై ఒకరు ఫి­ర్యా­దు చే­సు­కు­న్నా­రు. ఆసి­యా క్రి­కె­ట్ కౌ­న్సి­ల్(ఏసీ­సీ) అధ్య­క్షు­డి­గా ఉన్న పా­కి­స్థా­న్ క్రి­కె­ట్ బో­ర్డు(పీ­సీ­బీ) ఛై­ర్మ­న్ మో­హ్‌­సి­న్ నఖ్వీ చే­తుల మీ­దు­గా ట్రో­ఫీ­ని ని­రా­క­రిం­చేం­దు­కు భా­ర­త్ ని­రా­క­రిం­చిం­ది. దాం­తో ఆ ట్రో­ఫీ­ని నఖ్వీ తన వెంట తీ­సు­కె­ళ్లా­డు. ఇప్ప­టి­కీ ఆ ట్రో­ఫీ­ని భా­ర­త్ అం­దు­కో­లే­దు. ఇరు జట్ల మధ్య ఈ ఘట­న­పై తీ­వ్ర వా­దో­ప­వా­దా­లు నడు­స్తు­న్నా­యి. అయి­తే ఈ వరుస సం­ఘ­ట­న­లు భా­ర­త్, పాక్ మహి­ళల మ్యా­చ్‌­పై కూడా తీ­వ్ర ప్ర­భా­వం చూ­ప­ను­న్నా­యి. పా­కి­స్థా­న్ మహి­ళా ప్లే­య­ర్ల­కు కూడా షేక్ హ్యాం­డ్ ఇచ్చే­ది లే­ద­ని భారత కె­ప్టె­న్ హర్మ­న్‌­ప్రీ­త్ కౌర్ స్ప­ష్టం చే­సిం­ది. మై­దా­నం­లో ఇరు జట్ల మధ్య మాటల యు­ద్దం నడి­చే అవ­కా­శం ఉంది. ప్ర­స్తుత ఫామ్ చూ­సు­కు­న్నా.. గత రి­కా­ర్డు­ల­ను పరి­గ­ణ­లో­కి తీ­సు­కు­న్నా భారత మహి­ళల జట్టు­కు పా­కి­స్థా­న్ మహి­ళల టీమ్ ఏ మా­త్రం పోటీ కాదు. ఇప్ప­టి వరకు ఇరు జట్ల మధ్య 11 వన్డే­లు జర­గ్గా.. అన్ని మ్యా­చ్‌­ల­ను టీ­మిం­డి­యా­నే గె­లి­చిం­ది.

Tags:    

Similar News