డేవిడ్ వార్నర్ ( David Warner ) రిటైర్మెంట్‌పై క్రికెటర్ యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) స్పందించారు. ‘నిశ్శబ్దంగా వీడ్కోలు పలికేందుకు ఎవరూ ఇష్టపడరు. మీ కెరీర్ అత్యద్భుతం. గ్రౌండ్‌లో బౌండరీలు బాదడం నుంచి బాలీవుడ్ మూవ్స్, డైలాగ్స్ అన్నీ ప్రత్యేకమే. ఫీల్డ్‌లో, వెలుపల మీరు ట్రూ ఎంటర్‌టైనర్. మిత్రమా మీతో డ్రెస్సింగ్ రూమ్‌ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సమయాన్ని మీ లవ్లీ ఫ్యామిలీతో గడపండి’ అని ట్వీట్ చేశారు.
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ వార్నర్ పరోక్షంగా వారసుడిని ప్రకటించారు. రిటైర్మెంట్ అనంతరం యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘ఇక నుంచి అంతా నీదే ఛాంపియన్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఓపెనర్‌గా వార్నర్ స్థానాన్ని జేక్ భర్తీ చేసే అవకాశం ఉంది. IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతడు కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడారు.