కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్ చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ(16) ప్రాణాలు విడిచింది. కొన్ని రోజులుగా నిమ్స్ ప్రాణాలతో పోరాడుతున్న ఆమె సోమవారం మృతి చెందింది. కొమురం భీం జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 3న ఫుడ్ పాయిజన్ అయింది. స్కూల్లో భోజనం చేసిన విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మహాలక్ష్మి, జ్యోతి, శైలజను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. వీరిలో మహాలక్ష్మి, జ్యోతి కోలుకోగా శైలజ ఆరోగ్యపరిస్థితి విషమించింది. ఆమెకు ఉపిరితిత్తుల సమస్యతో పాటు మూత్రపిండాలపై ప్రభావం పడింది. దీంతో పలుసార్లు వైద్యులు డయాలసిస్ చేశారు. ఈ నెల 11 నుంచి శైలజను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శైలజ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు